‘ఆచార్య’ సెట్స్‌లోకి రామ్‌చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘ఆచార్య’ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశాడు. సినిమాలో రామ్‌చరణ్ పాత్ర పేరు ‘సిద్ధ’ అని కొరటాల తెలియజేస్తూ చెవిలో పోగు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాల వేసుకున్న గడ్డం ఉన్న లుక్‌తో రామ్‌చరణ్ ఫొటోను వెనుక వైపు నుండి పోస్ట్ చేశాడు కొరటాల. ఈ ఫోటోతో పాటు మా ' సిద్ధ ' సర్వం సిద్ధం అని కూడా పోస్ట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. ఇందులో చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడు. కాగా.. రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే నక్సలైట్ నాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. మరి ఆ పాత్రను కొరటాల శివ ఎలా ఎలివేట్ చేస్తాడోననేది ఆసక్తికరమైన అంశం. దేవాదాయశాఖలోని అవినీతిని ప్రశ్నించేలా కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ సెట్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మే 9న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com