పోస్టర్‌తో స్టోరీ చెబుతున్న ‘‘రామారావు ఆన్ డ్యూటీ’’
Send us your feedback to audioarticles@vaarta.com
క్రాక్ సినిమా హిట్‌తో మంచి జోరు మీదున్న మాస్ మహారాజా రవితేజ వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ వృద్ధ దంపతులకు నగదు ఇస్తూ సంతోషంగా కనిపిస్తున్నాడు.
ఇతరులకు ఆనందాన్ని అందించడం నిజమైన సంతృప్తిని ఇస్తుంది... ఈ పోస్టర్ ద్వారా సినిమాలో హీరో క్యారెక్టర్ తీరుతెన్నులను మేకర్స్ చూపించారు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. “రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీనితో పాటు రవితేజ ..రమేశ్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘‘ఖిలాడీ’’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. దీనిని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘‘థమాకా’’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రవి. అలాగే వంశీ తెరకెక్కిస్తున్న ‘‘టైగర్ నాగేశ్వరరావు’’. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘‘రావణాసుర’’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com