‘‘రామారావు’’ వచ్చేస్తున్నాడోచ్.. రిలీజ్ డేట్ లాక్ చేసిన మాస్ మహారాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లకు హాజరవుతున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వలో తెరకెక్కుతోన్న ‘‘ధమాకా’’ చిత్రీకరణలో ఇటీవలే ఆయన జాయిన్ అయ్యారు. దీని కంటే ముందే రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని రవితేజ విడుదలకు రెడీ చేశారు.
శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరోవైపు.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. జూన్ 17న ‘‘రామారావు’’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మిగిలివున్న కొద్దిపాటి షూటింగ్‌ను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్లింది. ఇక్కడి అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరిస్తోన్న పాటలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. కాగా.. దీనితో పాటు వంశీ తెరకెక్కిస్తున్న ‘‘టైగర్ నాగేశ్వరరావు’’. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘‘రావణాసుర’’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com