వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'రామరాజు ఫర్ భీమ్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం నుండి 'రామరాజు ఫర్ భీమ్' కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి(అక్టోబర్ 22) సందర్భంగా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు.
కొమురం భీమ్ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్లో సాగుతున్న ఈ టీజర్లో....
''
వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..
వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..
నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్''
అంటూ రామ్‌చరణ్ చెబుతున్న డైలాగ్స్, ఎన్టీర్ నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, హైటెక్నికల్ వేలూస్తో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)'. డిి.వి.వి.ఎంటర్టైన్మెంట్బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌తో పాటు, భీమ్ ఫర్ రామరాజు టీజర్లకు వరల్డ్ వైడ్‌గా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'రామరాజు ఫర్ భీమ్'కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడసాగారు. గురువారం రోజున విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే 'ఆర్ఆర్ఆర్'పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎన్నో వైరటీ పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఆ పాత్రలను మించేలా డిఫరెంట్ లుక్‌తో ఇందులో కనపడుతున్నారు. నేలతల్లిని నమ్ముకున్న ఓ అడవిపుత్రుడు ఎలా ఉంటాడో అలా కనపడుతున్నారు ఎన్టీఆర్. సినిమాలో ఆయన లుక్, బాడీ షేప్ అందరినీ ఔరా! అనిపిస్తున్నాయి. రామ్‌చరణ్ పాత్రను నిప్పుతో పోల్చిన జక్కన్న, ఎన్టీఆర్ పాత్రను నీటితో పోల్చుతూ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూపుల్లో ఆతృత మరింత పెరిగింది...
కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా రీసెంట్గా రీస్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మేజర్ పార్ట్ చిత్రీకరణను పూరిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ నవంబర్ నుండి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అలాగే సినిమాలో ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, హాలీవుడ్ స్టార్ ఓలివియా మోరిస్ ఇతర తారలు కొందరు తదుపరి షెడూల్లో జాయిన్ అవుతున్నారు.
రూ.45ం కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments