Ramanna Youth: 'రామన్న యూత్' రిలీజ్ డేట్ లాక్.. డా.జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ బేబీ సక్సెస్‌తో టాలీవుడ్లో చిన్న సినిమాలు జోరు చూపిస్తున్నాయి. కథ, కథనం బాగుంటే స్టార్ క్యాస్టింగ్‌తో పని లేకుండా జనం ఆదరిస్తారని తేలింది. దీంతో చిన్న నిర్మాతలు మంచి కథలను వెతికే పనిలో పడ్డారు. అలాగే యంగ్ టాలెంట్‌కు పట్టం కడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘‘రామన్న యూత్’’. కమర్షియల్ హంగులతో పాటు పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 15న రామన్న యూత్ రిలీజ్ కానుంది. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు.
సినిమా వినోదాన్ని అందించాలి.. ఎడ్యుకేట్ చేయాలి : జేపీ
ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. యువత సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా జీవితాలు పాడుచేసుకుంటున్నారని అన్నారనే బాధ తనకు వుందన్నారు. ఇలాంటి అంశాన్ని ఎంచుకుని దానికి వినోదాన్ని జోడించి మంచి సినిమా చేశారని చిత్ర యూనిట్‌ను జయప్రకాశ్ నారాయణ అభినందించారు. రామన్న యూత్ సినిమా గురించి చెప్పగానే తనకు సంతోషంగా అనిపించిందని.. ఇలాంటి సినిమాకి అందరూ మద్ధతుగా నిలవాలని జేపీ కోరారు. సినిమా అనేది వినోదాన్ని అందిస్తూనే ఎడ్యుకేట్ చేయాలని ఆయన అన్నారు. రామన్న యూత్ టీజర్ బాగుందని.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
యువతను రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు :
హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ.. మా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. రాజు అనే ఒక యువకుడు పొలిటికల్ లీడర్ గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది “రామన్న యూత్” చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించామన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పొలిటికల్ ఎంటర్టైనర్ ఇది అని నవీన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు.. వారిని కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది “రామన్న యూత్” సినిమాలో తెరకెక్కించాం అని అభయ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 15న “రామన్న యూత్” చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
నటీనటులు : అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.
సాంకేతిక నిపుణులు : కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి , సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్, ఆర్ట్ – లక్ష్మీ సింధూజ, సంగీతం – కమ్రాన్ , సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే, పీఆర్వో – జీఎస్ కే మీడియా, రచన దర్శకత్వం – అభయ్ నవీన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout