Ramanna Youth: శేఖర్ కమ్ముల చేతుల మీదుగా 'రామన్న యూత్' కాన్సెప్ట్ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
"జార్జ్ రెడ్డి" చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్ బేతిగంటి. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "రామన్న యూత్". ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామన్న యూత్ కాన్సెప్ట్ ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అనంతరం
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ....."రామన్న యూత్ ట్రైలర్ బాగుంది. నాయకుడి వెంట తిరిగి తమకో లైఫ్ ఉంటుందనే వారికి తాము నిర్లక్ష్యం చేయబడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. నాయకుల కోసం జెండాలు ఎత్తిన వారు ఏమవుతారు అనేది మంంచి పాయింట్. ఇక్కడే నవీన్ సక్సెస్ అయ్యాడు. ఇది మనం చూసిన ఒక ఊరి కథ. కొత్త కొత్త ఆలోచనలతో యంగ్ టాలెంట్ ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. నేనూ ఇలా చిన్న చిన్న చిత్రాలతోనే ప్రయాణం ప్రారంభించాను. మంచి సినిమా చేసేందుకు టీమ్ అంతా కష్టపడినట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ... శేఖర్ కమ్ముల, సుకుమార్ లాంటి దర్శకులను మేధావులు అని పిలుస్తుంటారు. నవీన్ నాకు మంచి మిత్రుడు. ప్రతి నటుడికి కథ రాయాలి, దర్శకత్వం చేయాలని ఉంటుంది. ఆయనా అలాగే ప్రయత్నిస్తున్నాడు అనుకున్నాను. నాకు ఈ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు దర్శకుడిగా నవీన్ ప్రతిభ చూసి ఇతనిలో మంచి విషయం ఉంది అనుకున్నాను. నాకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ అవుతుంది. రామన్న యూత్ టీమ్ అందరికీ గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుంది. అన్నారు.
దర్శకుడు హీరో నవీన్ బేతిగంటి మాట్లాడుతూ... మా కార్యక్రమానికి వచ్చి బ్లెస్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల గారికి థాంక్స్. ఈ సినిమా ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ చేయలేదు. రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథ ఇది. అతని జీవితంలోకి మిగతా వారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారన్నది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఈ కథలో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ సాగుతుంటుంది. ఈ ఆరు పాత్రలు కథకు ఎలా లింక్ అయ్యారన్నది బాగుంటుంది. కథను నమ్ముకుని సినిమా చేద్దామని అనుకున్నాను. ఫైర్ ఫ్లై వారు కూడా కథనే నమ్మి ముందుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన, పనిచేసిన అందరికీ కథపై నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మమ్మల్ని నిలబెడుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం అందరం ఇష్టపడి కష్టపడి పనిచేశాం. ఆల్ ద బెస్ట్ టు నవీన్ అండ్ టీమ్. ఒక మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటుడు అనిల్ గీల మాట్లాడుతూ... నవీన్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.
వాళ్ల నాన్న మాకు మ్యాథ్స్ చెప్పే టీచర్. మేము ఎదగడం ఆయన చూస్తారని
ఆశించాము. కానీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. నవీన్ కల ఈ సినిమా.
మాకూ మంచి పాత్రలు దొరికాయి. ఎప్పుడైనా కొత్త నటులుగా పేరు తెచ్చే పాత్రల్లో కనిపించాలని ఉంటుంది. అలాంటి పేరు తెచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు : అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com