రామా రీల్స్ 'షో టైమ్' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
'రామా రీల్స్' పతాకంపై ఎస్ ఎస్ కాంచి దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం 'షో టైమ్.. ఎస్.ఎస్. కాంచి దర్శకత్వంలో నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం, అడుగడుగునా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రం చాలా విభిన్నంగా బాగా వుంది.. అని మెచ్చుకోవడం జరిగింది. వారు ఈ చిత్రానికి "U /A" సర్టిఫికెట్ ఇచ్చారు.
తెలుగు / సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చిత్రాలు నిర్మించాలనే సంకల్పంతో రామా రీల్స్ అనే బ్యానర్ స్థాపించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చిత్రాలు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ బ్యానర్ ద్వారా మూడు చిత్రాలని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
కథ దర్శకత్వం వహించిన ఎస్.ఎస్. కాంచి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ రచయిత. సూపర్ హిట్ చిత్రాలైన ఈగ, మర్యాద రామన్న చిత్రాలకు కథ అందించిన కాంచి గారు, ఛత్రపతి, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర వంటి చిత్రాలకు సహా రచయితగా పని చేశారు. గతంలో "అమృతం" అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రజలందరి సుపరిచితులు కాంచి ఈ "షో టైం" చిత్రం ద్వారా తోసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్. ఎమ్. కీరవాణి గారి కి మరియు, దర్శకధీరుడు రాజమౌళి గారికి బ్రదర్. ఈ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ ని అమృతం సీరియల్ తో ఎలా మెప్పించారో అలా మెప్పిస్తారు. ఈ చిత్రానికి సంగీతాన్ని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి గారు అందించారు. ఈయన గతంలో ఎన్నో స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇటీవల ఘానా విజయాన్ని సాధించిన బాహుబలి చిత్రానికి ఈయనే సంగీత దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఆడియో సీడీలను అనుష్క విడుదల చేసి తొలి సీడీని శివశక్తిదత్తాకు అందించింది. ట్రైలర్‌ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు.
సినిమా థియేటర్లో జరిగే కథ. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆసక్తి కలుగుతుందని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. కాంచి మాటల్లో వెటకారం ఎక్కువగా కనపడుతుంటుంది. మా సినిమాల్లో తప్పులను వెతికే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు తన డైరెక్షన్‌లో వస్తున్న షో టైమ్ సినిమాలో మంఏ తప్పులు వెతుకుతాం. అయితే తన సినిమాలో ఏ తప్పులు ఉండకుండా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ట్రైలర్ చాలా బావుంది. సినిమా థియేటర్లో జరిగే కథ. మా కజిన్స్ అందరిలో కాంచీలోనే వెటకారం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో ఏ తప్పులు లేకుండా సినిమా మంచి విజయంతం కావాలని కోరుకుంటున్నాను. కాంచి తనేం చెప్పాలనుకున్నాడో చెప్పినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఆసక్తికరంగా సాగే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. కీరవాణిగారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని ఎస్.ఎస్.రాజమౌళి చెప్పారు.
రాజమౌళిగారి ఫ్యామిలీ ఎప్పుడూ నన్ను ఏదో ఒక కొత్త విషయంతో సర్‌ప్రైజ్ చేస్తుంటారు . అందరూ మంచి టాలెంటెడ్. పాటలు బావున్నాయి. టీం అందరూ చక్కగా నటించారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని అనుష్క చెప్పింది. మంచి సినిమా తీయగలను నమ్మకంతో చేసిన సినిమా ఇది. పెద్ద నాన్న, కీరవాణి, రాజమౌళి సహా నటీనటులు, టెక్నిషియన్స్ చక్కగా నటించారు. ఇక అందరూ చెప్పినట్టు నా సినిమాలో తప్పులను నా ఫ్యామిలీ మెంబర్స్ చూసి చెబితే సరిదిద్దుకుంటానని దర్శకుడు కాంచీ అన్నారు.
ఈ సినిమాలో ఎమోషన్స్ పాత్రధారులు. స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ ఏమీ లేవు. మంచి మ్యూజిక్ కుదిరింది. అందరికీ పాటలు కనెక్ట్ అవుతాయి. కాంచీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. కాంచీకి తను చేసే పని పట్ల మంచి అవగాహన ఉంటుంది. అదే అవగాహనతో సినిమాను చక్కగా చేసుంటాడని భావిస్తున్నానని ఎం.ఎం.కీరవాణి తెలిపారు. కాంచీగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్ ప్లానింగ్ కూడా ముందుగానే చెప్పడం విశేషం. కాంచీగారి దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత జాన్ సుధీర్ పూదోట.
కార్తీక్, సంజిత్, ఆదిత్య, సత్య, అమిత్ శర్మ, రవిప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: ఎస్.ఎస్.కాంచీ, మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: భూపతి.కె, స్టైలింగ్, సెట్ డేకరేషన్: సీతా కాంచీ, ఎడిటింగ్: ఎన్.హెచ్.హరి, వి.ఎఫ్.ఎక్స్: వెంకట్ సునీల్‌రావ్ ఆకుల, ఫైట్స్: రామ్, లైన్ ప్రొడ్యూసర్: నయీమ్ షేక్, కో ప్రొడ్యూసర్: కిరణ్ తనమల, ప్రొడ్యూసర్: జాన్ సుధీర్ పూదోట, దర్శకత్వం: కాంచీ 5497
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout