లవ్ యూ డాడీ.. హ్యాపీ బర్త్ డే: హీరో రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇతరా నటులతో పోలిస్తే రామ్ రూటే సపరేటు. కథలు ఎంచుకోవడంలో.. నయా ట్రెండ్‌ను సెట్ చేయడంలో ఈ కుర్రహీరో ముందు వరుసలో ఉంటాడు. సోషల్ మీడియాలో తన అభిమానులు, సినీ ప్రియులకు నిత్యం టచ్‌లో ఉండే రామ్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ట్వీట్ సారాంశం ఇదీ..
రామ్ తండ్రి మురళి మోహన్‌ది నేడు 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన తండ్రికి ఎనర్జిటిక్ హీరో వినూత్నంగా విషెష్ చెప్పాడు. "తండ్రీకొడుకుల మధ్య సంబంధం చాలా సరదాగా ఉంటుంది. ఐ లవ్ యూ డాడీ. ఈ విషయం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక మార్గంలో మీపై ప్రేమ చూపిస్తుంటాను. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను డాడీ.. నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టాను కూడా. థ్యాంక్యూ డాడీ. నేను మీలో ఒక భాగం.. మీరు నాలో భాగం లవ్ యూ డాడీ హ్యాపీ బర్త్ డే" అని రామ్ తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఓ హోటల్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు రామ్.
రామ్ ట్వీట్‌కు నెటిజన్లు, పలువురు అభిమానులు రియాక్ట్ అయ్యారు. రామ్ తండ్రితో తాము దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంకుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మీరు నిజంగానే రామ్‌కు తండ్రిలా లేరు మురళీ సార్.. మీరిద్దరూ అన్నదమ్ముళ్లలాగా ఉన్నారు.. హ్యాపీ బర్త్ డే అంటూ అని అభిమానులు తమ అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com