'శివమ్' బాటలో 'ఉన్నది ఒకటే జిందగీ'
Send us your feedback to audioarticles@vaarta.com
దేవదాసుతో కథానాయకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన యువ కథానాయకుడు రామ్.. రెడీ, మస్కా, కందరీగ, నేను శైలజ వంటి విజయాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా చేస్తున్నాడు. నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఇటలీలోని మిలన్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చిందని.. అక్టోబర్ 27న ఈ సినిమాని విడుదల చేయనున్నారని ఇన్‌సైడ్ టాక్.
అదే జరిగితే.. రామ్ కెరీర్‌లో ఓ డిజాస్టర్‌గా నిలిచిన శివమ్ విడుదలైన అక్టోబర్ నెలలోనే రామ్ నుంచి వచ్చే మరో సినిమా ఇదే అవుతుంది. శివమ్‌కి కలిసిరాని అక్టోబర్.. ఉన్నది ఒకటే జిందగీకైనా రామ్‌కి కలిసొస్తుందేమో చూడాలి. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments