ఫైర్ యాక్సిడెంట్‌పై జగన్‌కు రామ్ ట్వీట్!!
- IndiaGlitz, [Saturday,August 15 2020]
ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అలాంటి హీరో తొలిసారి కాంట్రవర్సీ విషయంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు. ఇంతకూ రామ్ ఏ విషయం గురించి మాట్లాడారో తెలుసా? ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో కొందరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రామ్ హాస్పిటల్‌ను అందరూ తప్పుపట్టారు. కానీ హీరో రామ్ ఈ వ్యవహారంపై ఘాటుగా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
‘‘పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎం వైెఎస్‌జగన్‌ని తప్పుగా చూపించడానికి!. మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం. ఫైర్ + ఫీజు = ఫూల్స్.. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’’ అని రామ్ ప్రశ్నించారు. అయితే రామ్ పర్టికులర్‌గా ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించాడని అందరూ అనుకుంటున్నారు.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం??#APisWatching
— RAm POthineni (@ramsayz) August 15, 2020
ఫైర్ + ఫీజు = ఫూల్స్
— RAm POthineni (@ramsayz) August 15, 2020
అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా?
ఫీజుల వివరణ: మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. #APisWatching pic.twitter.com/6TT1K2H4n2