కులంపై రామ్ ట్వీట్‌

  • IndiaGlitz, [Monday,August 17 2020]

తాను ఇక ట్వీట్స్ చేయ‌న‌ని చెప్పిన రామ్ ఆ మాట చెప్పి ఇర‌వై నాలుగు గంట‌లు గ‌డ‌వ‌క ముందే ట్వీట్ పెట్టారు. ర‌మేశ్ హాస్పిటల్స్ వ్య‌వ‌హారంపై గ‌త రెండు రోజులుగా రామ్ ట్వీట్స్ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌ర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్ర‌మాదంపై రామ్ ర‌మేశ్ హాస్పిట‌ల్స్‌ను స‌పోర్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మ బంధువుల‌ను కాపాడుకోవ‌డానికి హీరో రామ్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. ఆయ‌న‌కు నోటీసులు ఇస్తామంటూ స‌ద‌రు కేసు విచారిస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు.

ఈ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే హీరో రామ్ కుల ప్ర‌స్తావ‌న చేస్తూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ‘‘నా ప్రియ సోదర సోదరీమణులారా!!.. కులం అనే జ‌బ్బు క‌రోనా కంటే వేగంగా వ్యాప్తి అవుతుంది. చాలా ప్ర‌మాదక‌ర‌మైన అంటువ్యాధి. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండండి. మిమ్మ‌ల్ని ఇందులోకి ఎంత బ‌లంగా లాగ‌డానికి ప్ర‌య‌త్నించినా మీరు బ‌లంగా నిరోధించండి’’ అని తెలిపారు హీరో రామ్‌.

ఈ వ్య‌వ‌హారంపై అటు ప్ర‌భుత్వం ఇటు ర‌మేశ్ హాస్పిట‌ల్స్‌, స‌ద‌రు హాస్పిట‌ల్స్ త‌ర‌పున హీరో రామ్ ఒకరిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. మ‌రి ఈ గొడ‌వ ఎంత వ‌ర‌కు వెళుతుందో తెలియ‌డం లేదు.

More News

సందీప్‌ కిషన్‌ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం,

మ‌రోసారి ఆయ‌న‌కే ఓటేసిన క్రిష్‌..!!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ ఖాళీగా ఉన్నాడు. అయితే ఈ ఖాళీ స‌మ‌యాన్ని క్రిష్ ఏమాత్రం వేస్ట్ చేయ‌లేదు.

‘రాధేశ్యామ్’ ప్లానింగ్ అలా చేశారా?

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా అయిన‌ప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల‌పై చాలా ఫోక‌స్ పెరిగింది.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి కోర్టులు కలిసి వస్తున్నట్టు లేదు. దాదాపు ప్రతి కేసులోనూ ఏపీ ప్రభుత్వానికి అపజయమే ఎదురవుతోంది.

‘దృశ్యం’ దర్శకుడు మృతి అంటూ పుకార్లు.. మాధవన్ సహా సంతాపం..

హిందీ ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి చెందారంటూ ఆయన సన్నిహితుడు చెప్పిన మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.