డాక్టర్ అవతారంలో రామ్ చరణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈవారం నుంచి హైదరాబాద్ లో షూటింగ్ చేయనున్నారు. అయితే...రామ్ చరణ్ డాక్టర్ గా నటిస్తుంది ఈ చిత్రంలో కాదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ డాక్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఈ చిత్రానికి ఫార్ములా ఎక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నాడట సుకుమార్. టైటిల్ ను బట్టి ఇదేదో సైన్స్ ఫిక్సన్ మూవీ అనిపిస్తుంది. ఏది ఏమైనా... సుకుమార్ రామ్ చరణ్ తో ఓ ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. మరి...రామ్ చరణ్, సుకుమార్ ల ఫార్ములా ఎక్స్ ప్రయోగం ఫలిస్తుందో లేదో తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com