తేజు డైరెక్టర్ తో రామ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నేను శైలజ సినిమాతో సక్సెస్ సాధించిన ఎనర్జిటిక్ హీరో రామ్ కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత రామ్ నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల, కరుణాకరన్ లతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే... సుప్రీమ్ తో సాయిధరమ్ తేజ్ కి సక్సెస్ అందించిన అనిల్ రవిపూడి రామ్ కి ఇటీవల ఓ కథ చెప్పాడట. కథ నచ్చడంతో రామ్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. అయితే..సంతోష్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ కిషోర్ తిరుమల, కరుణాకరన్, అనిల్ రవిపూడి...ఈ ముగ్గురిలో ఎవరితో ముందు సినిమా చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com