రీమేక్ ఆలోచనలో రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే తదుపరి సినిమా ఓ రీమేక్ అనే వార్తలు బలంగా వినపడుతున్నాయి.
తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన 'తడం' సినిమా హక్కులను నిర్మాత స్రవంతి రవికిషోర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్ తదుపరి ఈ సినిమా తెలుగు రీమేక్‌లోనే నటించే అవకాశాలున్నాయంటున్నారు.
రామ్‌తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ప్రస్తుతం ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com