పాట పాడిన రామ్....
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్స్ అందరూ తమ గొంతను సవరించుకుంటున్నారు. కేవలం డబ్బింగ్ చెప్పడానికే కాదు.. పాటలు కూడా పాడుతున్నారు. పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా ఇలాంటి స్టార్స్ లిస్టులో రామ్ కూడా చేరారు. ఆయన తన తాజా చిత్రం `హలో గురు ప్రేమ కోసమే` కోసం పాట పాడారని వార్తలు వినపడుతున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ పాటను రామ్‌ను పాడాల్సిందిగా దేవి కోరాడట. ముందు నో చెప్పిన రామ్.. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సలహాలు, సూచనలతో పాటను బాగా పాడటం నేర్చుకుని పాడాడట. ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయ్యిందని సమాచారం. దసరా సందర్భంగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com