ప్రతి సినిమాకీ పెళ్లిని వాయిదా వేస్తున్నా: రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒకరు. టీనేజ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 'దేవదాసు' నుంచి తాజా 'హలో గురు ప్రేమ కోసమే' వరకూ రామ్ నటించిన సినిమాల్లో ఎక్కువశాతం ప్రేమకథా చిత్రాలే వున్నాయి. తెరపై ప్రేమకథల్లో భలే నటిస్తున్నారు. తెర వెనుక ప్రేమలో పడేది ఎప్పుడో? అని రామ్ గురించి మొన్నటివరకూ అనుకునేవారు. ఇప్పుడు అయితే 'హలో గురు.. పెళ్లి ఎప్పుడు?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఇంట్లో పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం లేదా?' అని ప్రశ్నిస్తున్నారు.
ఇంట్లో పెళ్లిగోలను ఎలా తప్పించుకుంటున్నదీ 'హలో గురు ప్రేమ కోసమే' విజయోత్సవ యాత్రలో రామ్ చెప్పారు. "మా ఇంట్లో త్వరగా పెళ్లి చేసుకోమని ఒకటే గోల పెడుతున్నారు. పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అని అడుగుతారు. వాళ్లు అడిగినప్పుడల్లా కాసేపు విననట్టు నటిస్తా. తరవాత 'ప్రస్తుతానికి ఏమీ అడగొద్దు. ఇప్పుడు చేస్తున్న సినిమా అయిపోయిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడదాం' అని అసలు విషయాన్ని దాటవేస్తా. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పుడు చేస్తున్న సినిమాతోనో, తరవాత సినిమాతోనో ముడిపెట్టి తప్పించుకుంటా" అని రామ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com