రామ్ సాయి గోకులం క్రియేషన్స్ 'ఆకలి పోరాటం'

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్సకత్వం లో నిర్మించిన చిత్రం ఆకలి పోరాటం ఈ వారం లో రిలీజ్ కి సిద్దమవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత వీర రాఘవులు మాట్లాడుతూ "మా చిత్రం ఆడియో ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మా ఆనందాన్ని తెలియజేస్తూ మా చిత్రాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీ న రిలీజ్ చేస్తున్నాము. ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ ఆనంద్ సాగర్ గారు బాగా తీశారు. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని మా నమ్మకం" అన్నారు.

దర్శకులు ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ "మంచి చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వారి తెలివి తేటలతో వాళ్ళ జీవితాలని చక్కదిద్దుకొని చిన్న వ్యాపారంతో మొదలు అయ్యి పైకి ఎదుకుతున్న వారి జీవితాలలోకి విలన్ ఎంటర్ అయ్యి వారిని ఇబ్బందులు పెట్టి, పోలీస్ కేసులు బనాయించిన వైనం, వాటి నుంచి తప్పించుకుని జీవితాలలో స్థిరపడిన వైనమే మా చిత్ర కథ. చిత్రం అందరి మన్ననలు పొందుతుందనే విశ్వాసంతో వున్నాము" అని తెలియజేసారు.

More News

సూర్య 'గ్యాంగ్' మూవీ ఫస్ట్ లుక్

స్టార్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి.

డ‌బ్బింగ్‌లో వ‌రుణ్ తేజ్ చిత్రం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'తొలి ప్రేమ' (ప్ర‌చారంలో ఉన్న పేరు). డెబ్యు డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు.

లేడీ డాన్స్ మాస్టర్ తో బన్నీ

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో బ‌న్నికి ఓ సెప‌రేట్ గుర్తింపు ఉంది. అదే డ్యాన్స్ బాగా చేస్తాడ‌ని. అందుకు త‌గిన‌ట్టు బ‌న్ని కూడా త‌న సినిమాల్లో డ్యాన్సులు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.

జెనీలియా రీ ఎంట్రీ...

బాయ్స్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా 'బొమ్మ‌రిల్లు'.  హ హ హాసినిగా జెనీలియా ఇంకా గుర్తుంది.

సాయిధరమ్ తేజ్ తో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే - ప్రసన్న

'జవాన్' సినిమాలో కేశవ అనే క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ లు నా పేరును రవికి చెప్పారు.