పూరీ జగన్నాథ్, రామ్ ఇస్మార్ట్ శంక‌ర్..

  • IndiaGlitz, [Thursday,January 03 2019]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ వ‌స్తుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. దీనికి ఇస్మార్ట్ శంక‌ర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. రామ్ ఇందులో త‌ల‌కిందులుగా సిగ‌రెట్ తాగుతూ అద్భుతంగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు రామ్. జ‌న‌వ‌రిలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

వీలైనంత త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్ర్యూ వివ‌రాలు తెల‌ప‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను పూరీ క‌నెక్ట్స్ స‌హ‌కారంతో పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్ పై పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

More News

నా జర్నీలో సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు - బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

'అల్లుడు శీను' చిత్రంతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టి సూపర్‌హిట్‌ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.

వై య‌స్ రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

తెలుగు వాళ్ల గుండెల్లో  ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి గా చ‌రిత్ర సృష్టించిన‌ డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చేసిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న‌చిత్రం యాత్ర‌.

విలేజ్ సెట్‌లో సైరా

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

పోసాని దర్శ‌క‌త్వం..

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దుప‌రి ద‌ర్శ‌కుడిగా మారారు. 'ఆప‌రేష‌న్ దుర్యోధ‌న' వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌ర్వాత 'శ్రావ‌ణ మాసం' 

చ‌ర‌ణ్ భాడీ ఫిట్‌నెస్ వెనుక సీక్రెట్ ఇదే...

'విన‌య‌విధేయరామ' చిత్రంలో ఆరు ప‌ల‌క‌ల దేహంతో చ‌ర‌ణ్ చొక్కా విప్పి విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతుంటే ఆడియెన్స్ ఆనందంగా విజిల్స్ వేశారు. అయితే ఆ లుక్ కోసం చ‌ర‌ణ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు