ఉత్కంఠ రేకేత్తించేలా రామ్, ప్రవీణ్ సత్తారు సినిమా?
Send us your feedback to audioarticles@vaarta.com
దిల్ రాజు నిర్మాణంలో రామ్, అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా మేఘా ఆకాష్ నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే వారం నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే.. గరుడవేగ` చిత్రంతో విజయం సాధించిన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కూడా రామ్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇటీవల ప్రవీణ్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తోంది. అనూహ్య మలుపులతో ఉత్కంఠను రేకెత్తించేలా విధంగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే స్క్రిప్ట్ వర్క్‌పై ప్రవీణ్ ఎక్కువ దృష్టి సారించారని సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. సాధ్యమైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి.. ఈ ఏడాది ఆఖరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే గనక జరిగితే రామ్ తన అభిమానులకు ఈ ఏడాది డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments