టైటిల్ కి తగ్గట్టు హై పవర్ చూపించిన రామ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ - కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్. ఈ చిత్రంలో రామ్ సరసన రాశీ ఖన్నా నటించింది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన హైపర్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఇందులో తండ్రి పై విపరీతమైన ప్రేమను చూపించే కొడుకుగా రామ్, తన పై చూపించే విపరీతమైన ప్రేమను తట్టుకోలేక వేరే వాళ్ల పై కూడా ప్రేమను చూపించుమని చెప్పే తండ్రిగా సత్యరాజ్ నటించారు.
టైటిల్ కి తగ్గట్టు రామ్ ఎనర్జిటిక్ గా నటించాడు.జిబ్రాన్ మ్యూజిక్ అదిరింది. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంత రిచ్ గా తీసారనేది ప్రతి ఫేమ్ లో కనిపిస్తుంది. ఇక అందాల తార రాశిఖన్నా గ్లామర్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ భారీ ఎంటర్ టైనర్ ని ఈ నెల 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే... టైటిల్ కి తగ్గట్టే రామ్ హై పవర్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి...ఈ హైపర్ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com