మాస్ డైరెక్ట‌ర్‌తో ఉస్తాద్‌..?

  • IndiaGlitz, [Saturday,March 20 2021]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ త‌న త‌దుప‌రి సినిమాకు లైన్ క్లియ‌ర్ చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఉస్తాద్ రామ్‌.. నెక్ట్స్ మూవీని ఎవ‌రితో చేస్తాడ‌నే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. అయితే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా ఖరారైంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌క ముందే రామ్ మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడ‌ని టాక్ వినిపిస్తోంది.

సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు రామ్ త‌దుప‌రి సినిమాను మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. లింగుస్వామి పూర్తి చేసిన త‌ర్వాత రామ్ కాస్త రెస్ట్ తీసుకుంటాడు. ఆ గ్యాప్‌లో బోయ‌పాటి శ్రీను.. బాల‌కృష్ణ‌తో సినిమాను పూర్తి చేసి రామ్ సినిమా క‌థ‌పై కూర్చుంటాడు. స్క్రిప్ట్ ఓకే అయిన త‌ర్వాత సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని స‌మాచారం. అంతా ఓకే అయితే, క్లాస్‌గా క‌నిపిస్తూ వ‌చ్చిన రామ్‌ను పూరీ జ‌గ‌న్నాథ్ మాస్ హీరోగా చూపించాడు. మ‌రోసారి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్... మాస్ పాత్ర‌లో ప్రేక్ష‌కాభిమానుల‌ను అల‌రిస్తాడ‌నడంలో సందేహం లేదు.