Boyapati Rapo: ఇంకేంటి దాటేది బొంగులో లిమిట్స్ .. ఊరనాటు లుక్‌, మాస్ డైలాగ్స్‌తో దుమ్మురేపిన రామ్

  • IndiaGlitz, [Monday,May 15 2023]

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాక్లెట్ బాయ్‌లా వుండే రామ్‌ను బోయపాటి ఎలా చూపిస్తారోనని సినీ జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సోమవారం రామ్ బర్త్ డేను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి ‘BoyapatiRAPO First Thunder' పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. దీనిని చూస్తే లవర్ బాయ్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడేందుకు రామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా వుంది. ఇస్మార్ట్ శంకర్‌తో పక్కా మాస్‌ టచ్ ఇచ్చిన ఆయన.. ఈ చిత్రంతో తనలోని ఊరనాటు లుక్‌ను పరిచయం చేశారు.

తన మార్క్ టేకింగ్‌తో రామ్‌ని ప్రజంట్ చేసిన బోయపాటి :

ఈరోజు విడుదల చేసిన ‘BoyapatiRAPO First Thunder' లో రామ్ ఓ దున్నపోతును నడిపించుకుంటూ తీసుకొస్తారు. ఈ సందర్భంగా ‘‘ నీ స్టేట్‌ దాటలేనన్నావ్‌.. దాటా.. నీ గేట్‌ దాటలేనన్నావ్‌.. దాటా.. నీ పవర్‌ దాటలేనన్నావ్‌.. దాటా.. ఇంకేంటి దాటేది బొంగులో లిమిట్స్ ’’ అనే డైలాగ్‌తో రామ్ అదరగొట్టాడు. ఫైట్స్‌, డైలాగ్ డెలివరీలోనూ రామ్ మెచ్యూరిటీ లెవల్స్ బాగున్నాయి. కెరీర్‌లో తొలిసారిగా రామ్‌తో బోయపాటి తన మార్క్ స్టంట్స్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇక వరుస విజయాలతో ఫుల్ ఫాంలో వున్న థమన్ ఎప్పటిలాగే అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. చూస్తుంటే.. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను నింపినట్లుగా కనిపిస్తోంది. ఈ చిన్న వీడియోతో రామ్- బోయపాటిలు అంచనాలు పెంచేశారు.

ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న BoyapatiRAPO:

అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతానికి #BoyapatRAPO అనే వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ కానిస్తున్నారు. త్వరలోనే సినిమా పేరు , రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం వుంది. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More News

Tirupati MP Gurumurthy:మాతంగి గెటప్‌లో వైసీపీ ఎంపీ : బన్నీని దింపేశాడుగా .. ఇది పుష్పగాడి రూల్ అంటోన్న ఫ్యాన్స్, ఫోటోలు వైరల్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు

Sudipto Sen:'ది కేరళ స్టోరీ' దర్శకుడు , హీరోయిన్‌ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలరం రేపిన సినిమా ‘‘ ది కేరళ స్టోరీ’’.

Prabhas : మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు.

Venky Atluri:టాలీవుడ్‌లో సెన్సేషనల్ : వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్.. ఈసారి అంతకుమించి..!!

దుల్కర్ సల్మాన్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. తన మాతృభాషలో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రభంజనం కారణంగా

Chandrababu Naidu:చంద్రబాబుకు జగన్ మార్క్ షాక్.. ఉండవల్లి గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన ఏపీ సర్కార్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జగన్ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది.