రామ్‌ నెక్ట్స్‌ మూవీ డైరెక్టర్‌ ఎవరో తెలుసా..?

  • IndiaGlitz, [Monday,January 11 2021]

ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌.. నెక్ట్స్‌ మూవీ ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే త్రివిక్రమ్‌తో రామ్‌ సినిమా చేసే అవకాశం ఉందని లాక్‌డౌన్‌ సమయంలో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై స్పందించిన రామ్, త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుంది కానీ, ఇప్పుడే కాదని, అందుకు సమయం పడుతుందని అన్నాడు. మరి రామ్‌ తదుపరి ఏ సినిమాను చేస్తాడు. అనే దానిపై సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు .. రామ్‌ తదుపరి ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడట. వివరాల మేరకు డైరెక్టర్‌ నేసన్‌ రీసెంట్‌గా రామ్‌కు చెప్పిన పాయింట్‌ నచ్చిందట. పూర్తి కథను సిద్ధం చేయమని అన్నాడట. ఎప్పటి నుండో తెలుగుతో పాటు పరభాషలోనూ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రామ్‌కు నేసన్‌ చెప్పిన స్క్రిప్ట్‌ అయితే ఇద్దరికీ నచ్చుతుంది కాబట్టి రెండు భాషల్లో సినిమా చేద్దామనుకుని ఓకే అన్నాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

మరో వైపు ఈ ఏడాది సంక్రాంతికి రెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రామ్‌. తమిళ చిత్రం తడంకు రీమేక్‌గా రూపొందిన చిత్రం రెడ్‌. తొలిసారి ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల తర్వాత రామ్‌, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఇందులో నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

More News

ద్వారకా తిరుమల ఆలయానికి రైస్ మిల్లర్స్ అసోషియేన్ భారీ విరాళం..

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శేషాద్రి కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

'దేవినేని' పాత్రలో తారకరత్న

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'దేవినేని'. దీనికి ''బెజవాడ సింహం'' అనేది ట్యాగ్ లైన్.

తుర్లపాటి మరణం నన్నెంతగానో బాధించింది: పవన్

ప్రముఖ జర్నలిస్ట్.. పద్మశ్రీ పురస్కార గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(89) కన్నుమూశారు.

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి:  రజినీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని రీసెంట్‌గా తెలియజేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రాలకు నేడు కరోనా వ్యాక్సిన్.. సాయంత్రంలోపు హైదరాబాద్‌కు..

అన్ని రాష్ట్రాలకు ఇవాళ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం పంపిణీ చేయనుంది. పుణె నుంచి అన్ని రాష్ట్రాలకు కొవిషెల్డ్ వ్యాక్సిన్‌ను పంపించనున్నారు.