రామ్ నెక్ట్స్ సినిమా ఫిక్స్...!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన తదుపరి సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్.. నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడనే దానిపై చాలా రకాలైన వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తమిళ దర్శకుడు నేసన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే నేసన్‌తో రామ్ సినిమా చేస్తాడు కానీ.. వెంటనే కాదట. ఇప్పుడు రామ్ సినిమా చేసేది కోలీవుడ్ డైరెక్టర్‌తోనే అయితే నేసన్‌తో కాదు. లింగుస్వామి. చాలా రోజులుగా లింగుస్వామి తెలుగు హీరోల కోసం తెగ ప్రయత్నాలు చేశాడు. బన్నితో కూడా సినిమా ఫిక్స్ అయ్యింది కానీ.. ఆగిపోయింది. ఇప్పుడు రామ్‌తో సినిమాను ఖరారు చేసుకున్నాడట.
ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్.. ఈశ్వర మాల వేసుకున్నాడు. ఈ దీక్ష పూర్తి కాగానే, రామ్ సినిమాను అధికారికంగా ప్రకటించి, వెంటనే సెట్స్‌పైకి తీసుకెళతాడట. లింగుస్వామి సినిమాను స్టార్ట్ చేసిన తర్వాతే నేసన్ సినిమాను ఫైనలైజ్ చేసి ట్రాక్ ఎక్కిస్తాడట రామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments