పాట చిత్రీకరణలో రామ్ కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు అతని ఎనర్జీ గుర్తుకొస్తుంది. అతను సరదాగా చేసే ఎంటర్టైన్మెంట్ గుర్తుకొస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అతను మెప్పించే ఎమోషన్ గుర్తుకొస్తుంది. సరిగ్గా అలాంటి అంశాలతోనే ఆయన తాజా చిత్రం రూపొందుతోంది. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్‌తో సాగే ఎనర్జిటిక్ సినిమాలో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ఆ సినిమా రూపొందుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. కృష్ణచైతన్య సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం గోవాలో చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ``రామ్, కీర్తి సురేష్‌పై ఆఖరి పాటను గోవాలో శనివారం (ఈనెల 21) నుంచి చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 26 వరకు ఆ పాట షూటింగ్ ఉంటుంది. రఘు మాస్టర్ నృత్య రీతుల్ని సమకూరుస్తున్నారు. దాంతో గుమ్మడికాయను కొట్టేస్తున్నాం. చక్కటి టైటిల్ కోసం పరిశీలిస్తున్నాం. వచ్చేవారంలో ఖరారు చేసి ప్రకటిస్తాం. రామ్‌ను ఫుల్ ప్లెడ్జ్ డ్గా ప్రొజెక్ట్ చేసే కథ ఇది. ఎనర్జిటిక్గానూ ఉంటుంది. అదే సమయంలో ఎమోషన్‌నీ పండిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ సాగుతుంది. మా సంస్థకు చాలా ఇష్టమైన పాటల రచయిత, మా సంస్థలో ఎన్నెన్నో సూపర్‌హిట్ పాటలను రాసిన సీతారామశాస్త్రిగారు చాలా కాలం తర్వాత మరలా ఈ సినిమాకు పాటలు రాశారు.
దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ఆల్బమ్‌తో రాక్ చేస్తారనడంలో సందేహం లేదు. జనవరి 1న చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాం`` అని అన్నారు. ఈ సినిమాకు కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ: కృష్ణ చైతన్య, నిర్మాత: స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments