హైదరాబాద్ లో రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌' 14 రీల్స్ చిత్రం

  • IndiaGlitz, [Monday,July 18 2016]

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సోమవారం (జూలై18) ఈ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ పుట్టినరోజు . ఈ సందర్భంగా...

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - '' ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ జూలై 14 నుంచి హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు నాన్ స్టాఫ్ షెడ్యూల్ ఉంటుంది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. దసరా కానుకగా సెప్టెంబర్ 30 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా 14 రీల్స్ బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది'' అన్నారు.

దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ ''నేను రామ్ చేసిన కందిరీగ వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా. రామ్ ఎనర్జీకి తగిన విధంగా సినిమా హైపర్ గా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సినిమా అవుట్ పుట్ ఎక్స్ ట్రార్డినరీగా వస్తుంది. రామ్ లోని ఎనర్జీని మరో లెవల్ ఎలివేట్ చేసే చిత్రమవుతుంది'' అన్నారు.

ఈ చిత్రానికి హైపర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More News

చిరు 150వ చిత్రం పై చిన్నికృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌డమే కరెక్ట్ అనుకుని సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే... చిరంజీవి 150వ చిత్రం కోసం రైట‌ర్ చిన్నికృష్ణ  ఓ క‌థ రెడీ చేసారు. కానీ...ఎందుక‌నో ఆ క‌థ చిరంజీవికి న‌చ్చ‌లేదు.

బాల‌య్య సినిమాకు చిరు స‌పోర్ట్‌....

నంద‌మూరి బాల‌కృష్ణ `ఆదిత్య 369` చిత్రం విడుద‌లై స‌రిగ్గా పాతికేళ్లైంది. విడుద‌లైన‌ప్పుడు సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి అప్పుడు అంద‌రూ గొప్ప‌గా మాట్లాడారు.

మెగా హీరో మూవీ టైటిల్ జ‌వాన్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సుప్రీమ్ స‌క్సెస్ సాధించ‌డంతో...త‌దుప‌రి చిత్రాలకు ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడు. తేజు న‌టించిన త‌దుప‌రి చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్నిఓమ్ ఫేమ్  సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు.

ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

నంద‌మూరి బాల‌కృష్ణ - సింగీతం శ్రీనివాస‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆదిత్య 369. విభిన్న క‌థాంశంతో రూపొందిన‌ ఆదిత్య 369 ప్రేక్ష‌కాభిమానులు ఆక‌ట్టుకుని తెలుగు నాట మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది.

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ విల‌న్‌గానే

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ 2005లో వ‌చ్చిన జై చిరంజీవ సినిమాలో విల‌న్‌గా న‌టించాడు. త‌ర్వాత మ‌ళ్ళీ టాలీవుడ్‌లో నటించ‌లేదు.