హైదరాబాద్ లో రామ్, సంతోష్ శ్రీన్వాస్' 14 రీల్స్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ప్రొడక్షన్ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సోమవారం (జూలై18) ఈ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ పుట్టినరోజు . ఈ సందర్భంగా...
నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - '' ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ జూలై 14 నుంచి హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు నాన్ స్టాఫ్ షెడ్యూల్ ఉంటుంది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. దసరా కానుకగా సెప్టెంబర్ 30 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా 14 రీల్స్ బేనర్లో ఇది మరో సూపర్‌హిట్ చిత్రం అవుతుంది`` అన్నారు.
దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ ``నేను రామ్ చేసిన కందిరీగ వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా. రామ్ ఎనర్జీకి తగిన విధంగా సినిమా హైపర్ గా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సినిమా అవుట్ పుట్ ఎక్స్ ట్రార్డినరీగా వస్తుంది. రామ్ లోని ఎనర్జీని మరో లెవల్ ఎలివేట్ చేసే చిత్రమవుతుంది`` అన్నారు.
ఈ చిత్రానికి హైపర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com