పతాక సన్నివేశాల్లో రామ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అందులో భాగంగా రామ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమాకు సంబంధించిన సింహభాగం చిత్రీకరణ పూర్తయినట్టే.
ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నేను శైలజ తరువాత సరైన విజయం లేని రామ్‌కు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com