పోలీస్ గా, డాక్టర్ గా హీరో రామ్.. లింగుస్వామి మూవీ స్టోరీ లీక్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మాస్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు. లింగుస్వామి దర్శత్వంలో తెరకెక్కే చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ మాస్ హిట్ అందుకున్న రామ్ మరోసారి అలాంటి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. లింగుస్వామితో మూవీ సెట్ కావడంతో రామ్ ఈ చిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు.
ఈ చిత్రంలో రామ్ కి జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర కథా నేపథ్యం లీక్ అయింది. లింగుస్వామి అద్భుతమైన పాయింట్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. ఈ చిత్రంలో రామ్ క్యారక్టరైజేషన్ విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రామ్ డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా డ్యూయెల్ షేడ్స్ లో నటించనున్నట్లు టాక్. డాక్టర్ రోగి శరీరంలో జబ్బుని నయం చేస్తాడు.. పోలీస్ అధికారి సమాజంలో ఉండే జబ్బుని నయం చేస్తాడు అనే కథాంశంతో లింగుస్వామి పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట.
ప్రతి నటుడు తన కెరీర్ లో ఒక్కసారి అయినా పోలీస్ గా, డాక్టర్ గా నటించాలని అనుకుంటారు. ప్రతి నటుడికి ఈ పాత్రలు డ్రీమ్ రోల్స్ లాంటివి. అలాంటిది రామ్ కి ఒకే చిత్రంలో ఈ రోల్స్ ప్లే చేసే ఛాన్స్ దక్కింది. మరి ఎనెర్జిటిక్ స్టార్ ఎలా రెచ్చిపోతాడో చూడాలి.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments