అయోధ్య "రామ్ లల్లా" విగ్రహం ఎంపిక ఖరారు.. ఎవరు చెక్కారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్య(Ayodhya) రామాలయంలో కొలువుదీరనున్న 'రామ్ లల్లా'(Ram Lalla) విగ్రహం ఎంపిక ఖరారైంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని గర్భ గుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) అధికారికంగా ప్రకటించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట చేయనున్న రాముని విగ్రహం కోసం డిసెంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. రామజన్మ భూమి ట్రస్ట్ సభ్యులు 'రామ్ లల్లా' విగ్రహాలను పరిశీలించారు. కర్ణాటకకు చెందిన మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండేలు రాముని విగ్రహాలను చెక్కారు. అయితే చివరకు అరుణ్ చెక్కిన శిల్పాన్ని ఎంపిక చేశారు.
అయోధ్య అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది 'రామ్ లల్లా' అంటే రాముడి చిన్ననాటి విగ్రహం. రాముడు బాలుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం పొడవు 51 అంగుళాలు, 8 అడుగుల ఎత్తు .. 3 అడుగుల వెడల్పు ఉంటుంది. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్(37) ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ కుమారుడు. ఎంబీఏ పూర్తి చేసిన అరుణ్ 2008లో కార్పొరేట్ ఉద్యోగం మానేసి కుటుంబం వారసత్వంగా నిర్వహిస్తున్న శిల్పకళా వృత్తిలోకి వచ్చారు.
ఇప్పటివరకు వెయ్యికి పైగా విభిన్న విగ్రహాలను చెక్కారు. కేదార్నాథ్ ఆలయంలో ఆదిశంకరాచార్య విగ్రహంతో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా అరుణ్ చెక్కారు. అలాగే మహారాజా జయచామరాజేంద్ర వడయార్ తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను ఆయన రూపొందించారు. అరుణ్‌కు చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యుడియూరప్ప(Yediyurappa) సంతోషం వ్యక్తం చేశారు. 'ఇది రాష్ట్రంలోని మొత్తం రామభక్తుల గర్వాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది' అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రతిష్ట కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి 2,500 మంది ప్రముఖులు, 4వేల మంది సాధువులు పాల్గొననున్నారు. జనవరి 22న 'రామ్ లల్లా' విగ్రహాన్ని ప్రధాని మోదీ(PM Modi) సమక్షంలో అయోధ్య రామ మందిర గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout