రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'స్రవంతి' రవికిశోర్ సినిమా ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తన కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్. సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. నేను శైలజ` ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి` రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలు. శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కొసరాజు రామ్మోహనరావు క్లాప్ ఇచ్చారు.
గతేడాది రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ`లో రామ్‌ను దర్శకుడు సరికొత్తగా చూపించారు. ఇప్పుడీ కొత్త చిత్రంలోనూ రామ్ లుక్, బాడీ లాంగ్వేజ్‌లను సరికొత్తగా చూపించనున్నారు.
నిర్మాత స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ – రామ్ లుక్ దగ్గర్నుంచి సైటల్ వరకూ ప్రతిదీ కొత్తగా ఉంటాయి. నేను శైలజ` తర్వాత కిశోర్ తిరుమల మరోసారి రామ్‌కి పర్ఫెక్ట్గా సూటయ్యే మంచి కథ రెడీ చేశాడు. ఏప్రిల్ 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం`` అన్నారు.
దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ – ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. నేను శైలజ` తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది`` అన్నారు.
యువ హీరో శ్రీవిష్ణు, పెళ్లి చూపులు` ఫేమ్ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: సిరివెన్నెల` సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments