'ఇస్మార్ట్ శంకర్'.. పక్కా ఊర మాస్..! (టీజర్ రివ్యూ)
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు నేడు. నేటితో రామ్.. 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ నటీనటులుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ టీజర్లో కథ ఎక్కడా రివీల్ చేయకుండా.. ఎవరికీ అర్థం కాని రీతిలో ఉంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, అప్పుడప్పుడు సెట్స్ చిత్రాలతో అంచనాలు పెంచిన చిత్రబృందం తాజాగా విడుదలైన టీజర్‌తో రామ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది.
టీజర్ రివ్యూ...
టీజర్ మొత్తమ్మీద.. రామ్ లుక్ సూపర్బ్.. ఇప్పటి వరకూ ఆయన నటించిన చిత్రాలతో పోలిస్తే ఇది కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెలిసిపోతోంది. రామ్ కటింగ్ స్టైల్, డ్రస్సింగ్ స్టైల్.. ముఖ్యంగా ఆ యాస భాష అందర్నీ మెప్పించేలా ఉంది. అభిమానులు, సినీ ప్రియులు ఇప్పటికే టీజర్‌కు పెద్ద ఎత్తున తమదైన శైలిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కథను ఎక్కువగా రివీల్ చేయకుండా.. కట్ కట్ చేసి శంకర్ క్యారెక్టరైజేషన్‌ని మాత్రమే హైలైట్ చేయడం బాగుంది. చార్మినార్ అడ్డాగా ఉండే శంకర్(రామ్)కు భయమంటే ఏంటో తెలియదు. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పడం తన దందాకు ఎవరు అడ్డు వచ్చినా చితగొట్టడం అతని స్టైల్ అంతే.. అన్నట్లుగా టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎవరైనా సరే.. కవ్విస్తే శంకర్‌కు చిరాకు.. బస్తీలో శంకర్ కింగ్ అన్నట్లుగా ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే మాఫియా వ్యవహారం ఎక్కువగా కనిపిస్తోంది. మాఫియాకు సైతం సవాల్‌గా శంకర్ మారుతున్నాడు. అయితే సవాళ్లను.. కామెడీ, లవ్ ట్రాక్‌ను పూరీ ఎలా నెట్టుకొస్తుడో సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.
డైలాగ్స్ విషయానికొస్తే...
టీజర్ చివరలో శంకర్ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అది కూడా తెలంగాణ యాసలో ఉండటంతో టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ.. గుడి ముంగట పొట్టేలును కట్టేసినట్టే’ .. ‘అలాగే మార్ ముంత చోడ్ చింత ’ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డైలాగ్సే సినిమాకు ప్లస్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. రామ్ అవతారం చూస్తే ఎన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. మొత్తమ్మీద ఒక్క మాటలో చెప్పాల్ రామ్ కిరాక్.. అంతే!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com