ఇది నా లైఫ్. అని అందరూ అనుకునేలా 'నేను.. శైలజ' ఉంటుంది - హీరో రామ్
- IndiaGlitz, [Monday,December 28 2015]
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను..శైలజ. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు. రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. జనవరి 1న నేను...శైలజ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను...శైలజ సినిమా గురించి హీరో రామ్ ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ సినిమాకి ముందుగా హరికథ అనే టైటిల్ అనుకున్నారు. ఆతర్వాత నేను..శైలజ గా మార్చారు కారణం ఏమిటి..?
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు హరి. అతను చెప్పే కథ కనుక హరికథ అనుకున్నాం. వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాం. అయితే హరికథ అంటే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుచేత నేను..శైలజ అని పెట్టాం.
ఈ సినిమాలో చాలా సార్లు లవ్ చేసి ఫెయిల్ అవుతారు కదా..ఫైనల్ గా సక్సెస్ అవుతారా..? ఫెయిల్ అవుతారా..?
సక్సెస్ అవుతానండి.
నేను..శైలజ కథ ఏమిటి..?
ఈ సినిమాలో హీరోయిన్, హీరోయిన్ ఫాదర్.. వారిద్దరివి టిపికల్ క్యారెక్టర్స్. హీరో క్యారెక్టర్ చాలా క్యాజువల్ గా ఉంటుంది. ఆ తండ్రి, కూతరు లైఫ్ లోకి హీరో ఎంటర్ అవుతాడు. హీరో వాళ్ల లైఫ్ లోకి ఎందుకు ఎంటర్ అవుతాడు..? ఆతర్వాత ఏం జరిగింది అనేది కథ. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఎవరికి వాళ్లు ఇది నా లైఫ్ అనుకునేలా ఈ సినిమా ఉంటుంది.
డైరెక్టర్ కిషోర్ గురించి..?
కిషోర్ మంచి రైటర్. ఈ సినిమాకి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే....ఇలా అన్నీ తనే రాసుకున్నాడు. వేరే సినిమాలకి కథ ఒకరిస్తే...స్ర్కీన్ ప్లే..మరొకరు ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ ఈ సినిమాకి అన్ని కిషోరే. వన్ మేన్ ఆర్మీలా..
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా గత చిత్రాల్లో ఉన్న నా క్యారెక్టర్ కి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మూవీలో నా క్యారెక్టర్ రియలిస్టిక్ గా ఉంటుంది. డి.జె గా కనిపిస్తాను. డైలాగ్స్ అన్నీ సహజంగా ఉంటాయి. అలాగే ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి.
శివమ్ ఫ్లాప్ తర్వాత ఈ సినిమా స్ర్కిప్ట్ లో ఏమైనా మార్పులు చేసారా..?
పండగ చేస్కో, శివమ్, నేను..శైలజ...ఈ మూడు స్ర్కిప్ట్ లు ఒకేసారి ఓకె చేసాను. శివమ్ ప్లాప్ అయిందని నేను..శైలజ స్ర్కిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
మీ సినిమాల్లో ఇన్ వాల్వ్ మెంట్ ఎంత వరకు ఉంటుంది..?
కథ చెప్పినప్పుడు కథలో మార్పులు చేర్పులు ఉంటే చెబుతాను. ఒక్కసారి కథ ఓకె అయిన తర్వాత డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తాను.
శివమ్ సినిమాకి రన్ టైం బాగా ఎక్కువ.శివమ్ ఫ్లాప్ అవ్వడానికి రన్ టైం కూడా ఒక కారణం అనుకోవచ్చా..?
రన్ టైం ఎక్కువ, తక్కువ అనేది సినిమా సక్సెస్ ని నిర్ణయిస్తుందంటే నేను నమ్మను. ఈ సంవత్సరంలో రిలీజైన సినిమాల్లో రన్ టైం ఎక్కువగా ఉండి సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. అందుచేత రన్ టైం కి సక్సెస్ కి సంబంధం లేదనేది నా అభిప్రాయం. ఇక నేను..శైలజ సినిమా రన్ టైం విషయానికి వస్తే...2 గంటల 14 నిమిషాలు.
హీరోయిన్ కీర్తి సురేష్ గురించి..?
ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి పెర్ ఫార్మర్ కావాలి. ఎవరైతే బాగుంటారని ఆలోచించి ఫైనల్ గా కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసాం. కీర్తి బ్రిలియంట్ ఏక్టరెస్. ఈ క్యారెక్టర్ కి కీర్తి 100 % యాప్ట్. ఖచ్చితంగా ఈ సినిమా కీర్తికి మంచి పేరు తీసుకువస్తుంది.
రీల్ లైఫ్ లో శైలజ ఉన్నారు. మరి రియల్ లైఫ్ లో శైలజ ఎవరు..?
ఇంకా ఎవరు లేరండి (నవ్వుతు...)
ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది..?
ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సినిమాలో నా క్యారెక్టర్ నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సెటిల్ గా చేయాలి. సెట్ లో కాస్త కన్ ఫ్యూజన్ గా ఉండేది. ఈ సినిమా చేయడం నాకు న్యూ ఎక్స్ పీరియన్స్.
ఈ సంవత్సరంలో జనవరి 1న రఘువరన్ బి.టెక్ రిలీజ్ చేసారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం జనవరి 1న నేను...శైలజ రిలీజ్ చేస్తున్నారు. సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా..?
ఈ సంవత్సరం జనవరి 1న రఘవరన్ బి.టెక్ రిలీజ్ చేసాం. మంచి కలెక్షన్స్ వచ్చాయి. జనవరి 1 కూడా మంచి డేట్ అని తెలిసింది. అయితే ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లేకపోతే లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలనుకున్నాం కుదరలేదు. ఆఖరికి జనవరి 1 మంచి డీట్ అని తెలుసు కనుక జనవరి 1న రిలీజ్ చేస్తున్నాం. అంతే తప్ప కావాలని ప్లాన్ చేసింది కాదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి...?
కందిరీగ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు.