టెన్షన్ లో రామ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గత చిత్రాలకు భిన్నంగా రియలిస్టిక్ గా ఉండే కథ, కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రామా నాయుడు స్టూడియోలో డబ్బింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే హాఠాత్తుగా దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి చనిపోవడంతో దేవిశ్రీ ఇప్పట్లో మ్యూజిక్ చేయలేని పరిస్థితి. మరి..నేను..శైలజ జనవరి 1 రిలీజ్ ప్లాన్ చేసారు. అందుచేత అనుకున్న విధంగా నేను..శైలజ జనవరి 1న రిలీజ్ అవుతుందా..? లేదా..? అని హీరో రామ్.. తెగ టెన్షన్ పడుతున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments