రామ్ 'హైప‌ర్' ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

కంద‌రీగ హిట్ త‌ర్వాత రామ్‌, సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. అంతే కాకుండా పండ‌గ చేస్కో, నేను..శైల‌జ వంటి విజ‌యాలు త‌ర్వాత రామ్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా బిజినెస్ స్టార్ట‌య్యింద‌ట‌. అందులో భాగంగా ఓవ‌ర్ సీస్‌(యు.ఎస్‌)లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ సినీ ప్యార‌డైజ్ రిలీజ్ హక్కుల‌ను కైవ‌సం చేసుకుంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా విడుద‌లైన సినిమా టీజ‌ర్‌, డ్యాన్సింగ్ టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

More News

నేనే రాజు, మంత్రినంటున్న రానా

ఒకప్పుడు ప్రేమ‌క‌థాచిత్రాల స్పెష‌లిస్టుగా పేరు పొంది బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు తేజ త‌ర్వాత చేసిన సినిమాలేవీ అనుకున్న స్థాయిలో స‌క్సెస్‌ను తెచ్చి పెట్టలేక‌పోయాయి.

చెర్రీ - సుక్కు మూవీ లేటెస్ట్ డీటైల్స్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

కాట‌మ‌రాయుడుకు ముహుర్తం ఖ‌రారు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

గూబ గుయ్ మ‌న్న‌ది ఎవ‌రికి..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...టాక్ తో సంబంధం లేకుండా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

అఖిల్‌కు హీరోయిన్ దొరికేసింది...?

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన అఖిల్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. దాంతో ఓ ర‌కంగా నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీ డిస్ట్ర‌బ్ అయ్యారు.