క్రిమినల్ లాయర్‌గా మారుతున్న రామ్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
మాళవికా శర్మ.. పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు. ముంబై నుండి టాలీవుడ్‌కి దిగుమతి అయిన ఈ సొగసరి రవితేజ సరసన నేలటిక్కెట్టు చిత్రంలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అసలు మాళవికా ఊసే లేకుండా పోయింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రెడ్ చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ మాళవికా శర్మ రోలే మెయిన్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా.. ఇప్పుడు ఈమె సినిమాల్లో సక్సెస్ కాకపోతే క్రిమినల్ లాయర్‌గా సెటిలైపోతానని అంటుంది. సినిమాల్లో వచ్చే ముందే లా డిగ్రీ అందుకున్న సెక్సీ భామ.. ఇప్పుడు ప్రముఖ లాయర్ పట్టాబి దగ్గర క్రిమినల్ లా నేర్చుకుంటుందట. ఇంటరిప్ చేస్తున్న ఈ ముంబై ముద్దుగుమ్మ షెడ్యూల్ గ్యాప్‌లో కోర్టు మెట్లు ఎక్కుతుందట. మాస్టర్లా పూర్తి చేయాలనుకుంటున్న ఈ హీరోయిన్ త్వరలోనే మాస్టర్ డిగ్రీ ఆఫ్ లా కోర్సు కోసం దరఖాస్తు చేసుకోనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com