'హలో గురు ప్రేమకోసమే' పాటలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ 'హలో గురు ప్రేమ కోసమే'. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటించారు. `సిసనిమా చూపిస్త మావ, నేను లోకల్` వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు నేడు మార్కెట్లోకి విడుదలయ్యాయి. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ... హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - "సినిమాకు సంబంధించిన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
మా బ్యానర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వర్క్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు.బెజవాడ ప్రసన్నకుమార్ మాటలు.. రచన సహకారం సాయికృష్ణ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments