హరికథ రిలీజ్ డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన శివమ్ సినిమా ప్లాప్ అవ్వడంతో...నెక్ట్స్ మూవీ హరికథ పై చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఇప్పటి వరకు జరిగిన హరికథ షూట్ చూసుకుని కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడట. ఈ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ శివమ్ ప్లాప్ అవ్వడంతో ఈ సంవత్సరంలో కాకుండా వచ్చేసంవత్సరం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో స్రవంతి మూవీస్ అందించిన రఘవరన్ బి.టెక్ మూవీని జనవరి1 న రిలీజ్ చేసారు. మంచి విజయాన్ని సాధించింది. అందుచేత హరికథ ను కూడా సెంటిమెంట్ గా జనవరి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి...ఈసారి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో..? లేదో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments