వర్మ సినిమాకి ఆమే ప్లస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ సుందరి సురభికి తెలుగు, తమిళ భాషల్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సొంతం చేసుకుంటూ బాణంలో దూసుకుపోతోందీ అమ్మడు. ముఖ్యంగా తెలుగులో ఈ భామ పేరుతో రెండు వరుస విజయాలు నమోదు కాబడ్డాయి. గతేడాది విడుదలైన 'బీరువా' తక్కువ బడ్జెట్ట్‌తో రూపొంది స్లీపర్ హిట్ గా నిలవగా.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' పెద్ద చిత్రాలతో పోటీపడి మరీ సక్సెస్‌ఫుల్ మూవీగా నిలిచింది.
ఈ నేపథ్యంలో తను హీరోయిన్‌గా నటించిన 'ఎటాక్' చిత్రంపై సురభి బోలెడు ఆశలనే పెట్టుకుంది. ఈ చిత్రంతో హీరోయిన్‌గా తనకు హ్యాట్రిక్ దక్కడం ఖాయంగా భావిస్తోంది. మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఏదేమైనా గత కొంతకాలంగా విజయాల్లేని వర్మ, మనోజ్‌లకి సురభి ట్రాక్ రికార్డ్ ప్లస్ గా నిలవనుంది. ఆమె లక్కీ ఛార్మ్.. లేట్‌గా రిలీజ్ అవుతున్న 'ఎటాక్' కి మంచి హిట్ టాక్‌ని అందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com