అదే తేడా అంటున్న వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఏదైనా అంటూనో లేక తన సినిమాల్లో ఏదో ఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు విజయవాడ రౌడీ యిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా కోసం డిసెంబర్ 20న హైదరాబాద్‌లో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకకు అమితాబ్, నాగార్జున ముఖ్యఅతిథులుగా వస్తుండటం విశేషం. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివేటప్పుడు అమితాబ్ నటించిన `అఖరి రాస్తా` సినిమా పైరసీ సీడీలను అమ్మాను. ఇప్పుడు అదే అమితాబ్‌తో సర్కార్ 3 చేస్తున్నానని పెర్కొన్నాడు. ఈ మెసేజ్‌తో అప్పుడు, ఇప్పుడు ఉన్న తేడాను వర్మ తన యాంగిల్లో తెలియజేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments