అదే తేడా అంటున్న వర్మ

  • IndiaGlitz, [Friday,December 09 2016]

ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని ఏదైనా అంటూనో లేక త‌న సినిమాల్లో ఏదో ఒక సెన్సేష‌న్‌తో వార్త‌ల్లో నిలిచిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు విజ‌య‌వాడ రౌడీ యిజం నేప‌థ్యంలో వంగ‌వీటి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా కోసం డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్‌లో ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ వేడుక‌కు అమితాబ్‌, నాగార్జున ముఖ్యఅతిథులుగా వ‌స్తుండ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా రాంగోపాల్ వ‌ర్మ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు. సిద్ధార్థ్ ఇంజ‌నీరింగ్ కాలేజ్‌లో చ‌దివేట‌ప్పుడు అమితాబ్ న‌టించిన 'అఖ‌రి రాస్తా' సినిమా పైర‌సీ సీడీల‌ను అమ్మాను. ఇప్పుడు అదే అమితాబ్‌తో స‌ర్కార్ 3 చేస్తున్నాన‌ని పెర్కొన్నాడు. ఈ మెసేజ్‌తో అప్పుడు, ఇప్పుడు ఉన్న తేడాను వ‌ర్మ త‌న యాంగిల్‌లో తెలియ‌జేయ‌డం విశేషం.

More News

కళ్యాణ్ రామ్ బ్యానర్ లో ఎన్టీఆర్ 27 వ చిత్రం ఖరారు

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది.

'ఆకతాయి' మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్

వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్పై ఆశిష్రాజ్, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా రామ్భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `ఆకతాయి`.

ఒకేసారి ఆ ఇద్దరి హీరోలతో రకుల్..!

టాలీవుడ్ లో అనతికాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..!

గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ వాయిదా..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.జాగర్ల మూడి క్రిష్ తెరకెక్కిస్తున్న

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'

లక్కీ మీడియా బ్యానర్ ను స్టార్ట్ చేసి పదేళ్లుగా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి)