మీరు బాలీవుడ్‌ను పక్కకునెట్టేశారు... ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడిపై ఆర్జీవీ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ .. ఇటీవలి కాలంలో మళ్లీ జోరు పెంచారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానితో యుద్ధానికి దిగిన వర్మ.. అమరావతికి సైతం వెళ్లొచ్చారు. తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా వున్న ఆయన.. ఇటీవల యాంకర్ శ్యామలపై హాట్ కామెంట్స్ చేశారు. ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ఇంత అందంగా వున్న మీరు నా నుంచి ఎలా తప్పించుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఓ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఎవరో కాదు.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి. 1990వ దశకంలో జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న కాశ్మీరి పండిట్ల ఊచకోతను ఆధారంగా చేసుకుని వివేక్ తెరకెక్కిన ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా.. కేవలం కథకు మాత్రమే పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మంచి కలెక్షన్స్ సైతం రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభినందించిన సంగతి తెలిసిందే.
తాజాగా వర్మ సైతం వివేక్‌కు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎంతో వివాదాస్పదమైన ఈ ఉదంతాన్ని ధైర్యంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్‌ను పక్కకు నెట్టేసి.. కొత్తతరం ఫిల్మ్ మేకర్స్‌ని సృష్టించే విధంగా వివేక్ వుడ్‌ని పరిచయం చేశారని ప్రశంసించారు. పరిశ్రమకు కొత్తతరం ఫిల్మ్ మేకర్స్ రావడం శుభపరిణామమని రామ్ గోపాల్ వర్మ ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout