ఈసారి పదిలక్షలు ఇస్తానంటున్నాడుగా!!
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై పూర్తి కాన్‌సన్‌ట్రేషన్‌గా ఉన్నాడు. విజయదశమికి అక్టోబర్ 19న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ ఎన్టీఆర్ బయోపిక్ ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి కోణంలో ఉంటుంది కాబట్టి.. ఆ సినిమాకు `లక్ష్మీస్ ఎన్టీఆర్` అనే పేరు కూడా పెట్టాడు. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి.. చంద్రబాబు నాయుడుని పోలిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాడు.
నిన్న ఆయనే చంద్రబాబులాంటి వ్యక్తి వీడియో పోస్ట్ చేసి వెతికి ఆడ్రస్ చెప్పినా.. ఫోన్ నెంబర్ చెప్పినా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడంతో అది ట్రెండ్ అయ్యింది. ఎట్టకేలకు వర్మ ఆ వ్యక్తి పట్టుకున్నాడు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ``‘ముగ్గురు నటుల్ని షార్ట్‌లిస్ట్ చేశా. కానీ నాకు ఇంకా బెస్ట్ వ్యక్తి కోసం చూస్తున్నా..లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్ ఏ వయసులో ఉన్నారో, అప్పుడు ఎలా కనిపించేవారో.. అలా ఉండే నటుడు కావాలి. ఆయనలా ఉండే, మాట్లాడే వ్యక్తి కనపడితే వీడియోనుlaksmisntr@gmail.comకు పంపండి. వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తానని ఓపెన్‌గా ఆఫర్ చేస్తున్నా`` అన్నారు వర్మ. మరి వర్మ వేట ఫలిస్తుందంటారా! చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments