ఈసారి ప‌దిల‌క్ష‌లు ఇస్తానంటున్నాడుగా!!

  • IndiaGlitz, [Tuesday,October 16 2018]

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై పూర్తి కాన్‌స‌న్‌ట్రేష‌న్‌గా ఉన్నాడు. విజ‌య‌ద‌శ‌మికి అక్టోబ‌ర్ 19న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నాడు. అయితే ఈ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఉంటుంది కాబ‌ట్టి.. ఆ సినిమాకు 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' అనే పేరు కూడా పెట్టాడు. ఇందులో చంద్ర‌బాబు నాయుడు పాత్ర కీల‌కంగా ఉంటుంది కాబ‌ట్టి.. చంద్ర‌బాబు నాయుడుని పోలిన వ్య‌క్తి కోసం అన్వేషిస్తున్నాడు.

నిన్న ఆయ‌నే చంద్ర‌బాబులాంటి వ్య‌క్తి వీడియో పోస్ట్ చేసి వెతికి ఆడ్ర‌స్ చెప్పినా.. ఫోన్ నెంబ‌ర్ చెప్పినా ల‌క్ష రూపాయ‌లు ఇస్తాన‌ని చెప్ప‌డంతో అది ట్రెండ్ అయ్యింది. ఎట్ట‌కేల‌కు వ‌ర్మ ఆ వ్య‌క్తి ప‌ట్టుకున్నాడు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ''‘ముగ్గురు నటుల్ని షార్ట్‌లిస్ట్‌ చేశా. కానీ నాకు ఇంకా బెస్ట్ వ్య‌క్తి కోసం చూస్తున్నా..లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్‌ ఏ వయసులో ఉన్నారో, అప్పుడు ఎలా కనిపించేవారో.. అలా ఉండే నటుడు కావాలి. ఆయనలా ఉండే, మాట్లాడే వ్యక్తి కనపడితే వీడియోనుlaksmisntr@gmail.comకు పంపండి. వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తానని ఓపెన్‌గా ఆఫర్‌ చేస్తున్నా'' అన్నారు వ‌ర్మ‌. మ‌రి వ‌ర్మ వేట ఫ‌లిస్తుందంటారా! చూద్దాం..

More News

కాజ‌ల్ ప్లేస్‌లో స‌మంత‌...

హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లో న‌టిస్తూ న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకుంటున్న హీరోయిన్స్‌లో అనుష్క‌తో పాటు స‌మంత‌, కాజ‌ల్ ముందు వ‌రుస‌లో ఉంటున్నారు.

పరువు హత్య ఆధారంగా 'బంగారి బాలరాజు' - దర్శకుడు కోటేంద్ర దుద్యా

నంది క్రియేషన్స్ పతాకంపై  నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో  కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బంగారి బాలరాజు' చిత్రం ఈనెల 25న విడుదల కానుంది.

ఈ నెల 26న వస్తున్న'భాగ్యనగరం'

కన్నడలో కె.వి.రాజు దర్శకత్వంలో.. 'రాజధాని' పేరుతో రూపొంది, అక్కడ అసాధారణ విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'భాగ్యనగరం'

'అనగనగా ఓ ప్రేమకథ' లోని  "ఒక తొలిప్రేమ" పాటను విడుదల చేసిన పరశురామ్

'అనగనగా ఓ ప్రేమకథ ' ఈ చిత్రానికి సంబంధించిన 'ఒక తొలిప్రేమ' సాంగ్ ను ప్రముఖ  దర్శకుడుపరశురామ్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.

అంతా విచిత్రం ఆడియో విడుదల!

అయాన్ ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు (కన్నారావు) ఆశీస్సులతో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం 'అంతా విచిత్రం'.