వంగవీటి రాధాతో రామ్ గోపాల్ వర్మ భేటి
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంగవీటి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వంగవీటి చిత్రాన్ని వర్మ వాస్తవాలకు విరుద్ధంగా రూపొందిస్తున్నారని ఆరోపిస్తూ వంగవీటి రాధా హైకోర్టు లో పిటిషన్ వేసారు. అలాగే సెన్సార్ అనుమతి లేకుండానే ట్రైలర్ & టీజర్ ఇంటర్నెట్ లో రిలీజ్ చేసారని ఫిర్యాదు చేసారు.
కోర్టులో పిటిషన్ నేపధ్యంలో వర్మ వివాదస్పదమైన కమ్మ కాపు సాంగ్ ను సినిమా నుంచి తొలగిస్తామన్నారు. దీంతో హైకోర్టు ఈ కేసును నిన్న కొట్టేసింది. ఈరోజు వర్మ విజయవాడ వెళ్లి వంగవీటి రాధాకృష్ణను కలవడం విశేషం. ఈరోజు సాయంత్రం విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటి గ్రౌండ్స్ లో వంగవీటి ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments