RGV Konda Trailer : కొన్నిసార్లు నేరం మంచి తనం నుంచి పుడుతుంది.. ఇంట్రెస్టింగ్‌గా ‘కొండా’ సెకండ్ ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
నిజజీవిత కథలను సినిమాలుగా తెరకెక్కించి హిట్లు కొట్టడంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చేయి. గతంలో ఆయన తెరకెక్కించిన రక్తచరిత్ర, వంగవీటి వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం కొండా. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి ఆయన సతీమణి, మాజీ మంత్రి కొండా సురేఖ జీవిత కథ ఆధారంగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘‘కొండా’’.
తెలంగాణలోని భూస్వామ్యం, నక్సలిజం, ప్రజల ఇబ్బందులే ఇతివృత్తంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిగుణ్, ఐరా మోర్ ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన కొండా మొదటి ట్రైలర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా శుక్రవారం ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి’ అంటూ వర్మ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కొండా పాత్రను వర్మ చాలా పవర్ ఫుల్‌గా చూపించినట్లుగా అర్థమవుతోంది. అలాగే ‘క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచి పుడుతుంది’ అని కొండా మురళి పాత్ర చెబుతున్నట్లు ఉన్న కొటేషన్‌ను సినిమా థీమ్ ఏంటో వర్మ చెప్పేశారు. మొత్తం మీద సెకండ్ ట్రైలర్‌తో కొండాపై అంచనాలు పెంచేశారు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments