గగ్గోలు పెడుతున్న రాంగోపాల్ వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో కొన్ని పాత్రల్లో కొందరు నటీనటుల పెర్ఫార్మెన్స్ చూశాక వారు తప్ప మరెవరూ ఆ పాత్రలో నటించలేరని అనుకుంటుంటాం. అలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్‌లో సీనియర్ హీరోయిన్, నటి రమ్యకృష్ణ నటించి శివగామి పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మాహిష్మతి సామ్రాజ్య రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతం. గతంలో రజనీకాంత్‌తో నరసింహా చిత్రంలో నీలాంబరి పాత్రలో మెప్పించిన రమ్యకృష్ణ, ఆ పాత్ర ఎంత పేరు తెచ్చిందో అంతకంటే డబుల్ రెస్పాన్స్ పాత్ర శివగామి పాత్రలో నటించినందుకు రమ్యకృష్ణకు వచ్చింది.
అయితే ఈ పాత్ర కోసం రాజమౌళి ముందుగా నటి శ్రీదేవిని సంప్రదించారట. కానీ శ్రీదేవి రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడం, పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రాజమౌళి రమ్యకృష్ణను ఆ పాత్రకు తీసుకున్నాడట. ఇప్పుడు ఆ పాత్ర చేయలేదని శ్రీదేవి బాధపడుతుందో లేదో కానీ, ఆమె ఆరాధ్య ప్రేమికుడు, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం తెగ ఫీలైపోతున్నాడు. శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తర్వాతే బాహుబలి స్టార్టయ్యింది. అసలు శ్రీదేవి శివగామి పాత్ర చేసుంటే బాహుబలిగానటించిన ప్రభాస్ కంటే శ్రీదేవికే ఎక్కువ పేరు వచ్చుండేదని, శ్రీదేవి సినీ కెరీర్‌లోనే బాహుబలి ఓ మైల్‌స్టోన్ మూవీ అయ్యేదని ట్విట్టర్ ద్వారా గగ్గోలు పెట్టేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com