మీకు అధికారమిచ్చింది, మా నెత్తిన కూర్చోవడానికి కాదు.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: రామ్‌గోపాల్ వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీ నటులు- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ప్రభుత్వం వేసిన కమిటీ తాత్కాలికంగా తాళాలు వేసినా.. ఏదో రకంగా రచ్చ రేగుతూనే వుంది. ఆదివారం పెదరాయుడు రాసిన బహిరంగ లేఖకి తోడు క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ చేస్తున్న రచ్చతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకునేలాగా వుంది. ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై వర్మ ఏకంగా టీవీ ఛానెళ్ల లైవ్ డిబేట్లలో కూర్చుంటున్నారు. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ మరుసటి రోజే వర్మ తన ట్విట్టర్ ద్వారా మరికొన్ని ప్రశ్నలు సంధించారు.
1. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఏమిటి..?
2. గోధుమలు, బియ్యం, కిరోసిన్ నూనె మొదలైన నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమతౌల్యత కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ధరను నిర్ణయించవచ్చని నాకు అర్ధమైంది.. అయితే అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది ?
3. ఆహార ధాన్యాల విషయంలో కూడా బలవంతంగా ధర తగ్గించడం వల్ల రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు, తద్వారా కొరత ఏర్పడి నాణ్యత లోపిస్తుంది, అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది .
4. పేదలకు సినిమా చాలా అవసరమని మీకు అనిపిస్తే, ప్రభుత్వం జేబులోంచి బ్యాలెన్స్ చెల్లించి వైద్య, విద్యా సేవలకు ఎలా రాయితీ ఇస్తున్నారో ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు సార్?
5. బియ్యం, పంచదార మొదలైన వాటిని పేదలకు అందించడానికి రేషన్ షాపులు ఏర్పాటు చేశారు. మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా సార్?
6. నిర్ధిష్ట పరిస్థితుల్లో సమతౌల్యత కంటే దిగువన లేదా అంతకంటే ఎక్కువ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత సినీ పరిశ్రమలో మీరు ఏ ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు సార్?
7. ద్వంద్వ ధరల వ్యవస్థా సిద్ధాంతంలో పరిష్కారం ఉంటుంది, ఇక్కడ నిర్మాతలు ఎవరి ధరకు వారు టిక్కెట్‌లను విక్రయించవచ్చు . ప్రభుత్వం కొన్ని టిక్కెట్‌లను కొనుగోలు చేసి పేదలకు తక్కువ ధరలకు అమ్మవచ్చు, తద్వారా మేము మా డబ్బును పొందుతాము, మీరు ఓట్లను పొందండి
8. ఆడమ్ స్మిత్ ఆర్థిక సూత్రాల నుండి లైసెజ్ ఫెయిర్ సిస్టమ్స్ యొక్క ప్రబలమైన సిద్ధాంతాల వరకు, ప్రైవేట్ వ్యాపార విషయాలలో ప్రభుత్వ జోక్యం ఎప్పుడూ పని చేయలేదని నిరూపించబడిందన్నది వాస్తవం.
9. మీ బృందం హీరోల ధరలను అర్థం చేసుకోవాలని కోరుతున్నా... అల్లుఅర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరుల రెమ్యునరేషన్ వారి సినిమా ప్రొడక్షన్‌కి అయ్యే ఖర్చు, రాబడిని బట్టే నిర్ణయింపబడుతుంది.
10. మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి వారికి మద్దతు ఇవ్వడానికి అధికారం ఇచ్చారని, మా తలపై కూర్చోవడానికి కాదని అర్థం చేసుకోవాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments