వచ్చే ఎన్నికల్లో పవన్ జనసేన పేలిపోవడం ఖాయం..! - రామ్ గోపాల్ వర్మ..!

  • IndiaGlitz, [Thursday,December 22 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం వంగ‌వీటి. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా వంగ‌వీటి చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించారు. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సంచ‌ల‌న చిత్రం ఈనెల 23న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...!
వ‌ర్మ మారాడు అంటున్నారు నిజ‌మేనా..?
నా మ‌న‌సు మారింది..ప‌ద్ద‌తులు మారాయి...నా హెయిర్ స్టైలు మారింది. కానీ...నేను మారాను అంటుంటే ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.
విజ‌య‌వాడ‌లో ఆ గొడ‌వ‌లు జ‌రిగిన‌ప్పుడు మీరు చూసారా..?
నేను కాలేజీలో చ‌దువుతున్న రోజుల్లో ఓ గ్యాంగ్ వెళుతున్న కారును ఆపి బ‌య‌ట‌కు దిగ‌మ‌ని అడ్డుప‌డితే...స‌డ‌న్ గా ఆ కారులోంచి క‌త్తులుతో దిగారు అది చూసి నేను షాక్. నేను రౌడీల‌ను చూడ‌డం అదే ఫ‌స్ట్ టైమ్.
ఆ టైమ్ లో వంగ‌వీటిని క‌లిసారా..?
వంగ‌వీటి రంగాను మూడు సార్లు చూసాను. ముర‌ళీ మాట్లాడ‌డం చూసాను కానీ...ప‌ర్స‌న‌ల్ గా క‌లిసి మాట్లాడ‌లేదు.
ఈ మూవీకి వంగ‌వీటి అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం..?
విజ‌య‌వాడ‌లో రౌడీయిజం అనే క‌ల్చ‌ర్ వంగ‌వీటి రంగా నుంచే స్టార్ట్ అయ్యింది. అందుక‌నే వంగ‌వీటి అని టైటిల్ పెట్టాను.
ఈ సినిమాని ఆ సంఘ‌న‌లు జ‌రిగిన ప్ర‌దేశాల్లోనే తీసారా..?
కొన్ని సీన్స్ ను రియ‌ల్ గా జ‌రిగిన ప్లేస్ లో తీసాను. కొన్ని సెట్స్ లో తీసాను. ముంబాయిలో కూడా కొన్ని సీన్స్ తీసాను. ఈ సినిమాలో ప్ర‌తిదీ చాలా డీటైల్డ్ గా చెప్పాను. ఇందులో చెప్పినంత డీటైల్డ్ గా ఏ సినిమాలో చెప్ప‌లేదు అనేది నా ఫీలింగ్.
విజ‌య‌వాడ ప్రాంతానికి సంబంధించిన ఈ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా..?
ఆ క‌థ తెలిసిన వాళ్లు, విజ‌య‌వాడ వాళ్లు సినిమాగా ఎలా తీసారు అని చూస్తారు. ఆ క‌థ తెలియ‌న వాళ్లు ఒక సినిమాగా చూస్తారు. షోలే సినిమాని ప్ర‌పంచం మొత్తం చూసారు. అలాగే గాడ్ ఫాద‌ర్ సినిమా కూడా. నా డాట‌ర్ కి ర‌క్తచ‌రిత్ర సినిమా తీసేంత వ‌ర‌కు ప‌రిటాల ర‌వి పేరు విన‌లేద‌ట‌. అయినా సినిమా చూసింది. అందువ‌ల‌న ఒక ప్రాంతానికి సంబంధించిన క‌థ అయినా మిగిలిన వాళ్లు సినిమాగా చూస్తారు.
మీరు కాలేజీలో చ‌దువుతున్న రోజుల్లో రౌడీల‌ను చూసి భ‌య‌ప‌డ్డారా..?
నేనే ఒక రౌడీ. నేనందుకు భ‌య‌ప‌డ‌తాను (న‌వ్వుతూ...)
ఈ సినిమాలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఉంటుందా..?
అది స‌స్పెన్స్..! సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..!
వంగ‌వీటి తెలుగులో నా ఆఖ‌రి చిత్రం అన్నారు క‌దా..! కార‌ణం ఏమిటి..?
వంగ‌వీటి తెలుగులో నా ఆఖ‌రి చిత్రం అన‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) న్యూక్లియ‌ర్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ చేస్తున్నాను. అది పూర్త‌వ్వ‌డానికి రెండు మూడు సంవ‌త్స‌రాలు అవుతుంది. 2) వంగ‌వీటి సినిమా క‌న్నా కిక్ ఇచ్చే స‌బ్జెక్ట్ తెలుగులో ఇంకొక‌టి సెట్ అవుతుంది అనుకోవ‌డం లేదు. అందుక‌నే వంగ‌వీటి తెలుగులో నా ఆఖ‌రి చిత్రం అన్నాను.
ఇంటర్నేష‌న‌ల్ మూవీ న్యూక్లియ‌ర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం..?
వ‌చ్చే సంవ‌త్స‌రం మేలో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.
శ‌శిక‌ళ టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేసారు క‌దా..? ఈ సినిమా ఎప్పుడు..?
త‌మిళ‌నాడు ఎన్నిక‌ల టైమ్ కి ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తాను.
శ‌శిక‌ళ టైటిల్ తో సినిమా అంటూ జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ‌కు ఒక పువ్వు ఇస్తున్న ఫోటో ట్విట్ట‌ర్ లో పెట్టారు క‌దా..? ఈ ఫోటో పెట్ట‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఏమైనా ఉందా..?
జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్. అందుక‌నే ఆ ఫోటో పెట్టాను (న‌వ్వుతూ...) ఈ ఫోటో పెట్ట‌డం వ‌ల‌న మీకు ఎలా అర్ధం అయ్యింది..?
మీరు ఏమ‌నుకుని ఈ ఫోటో పెట్టారో...అదే అర్ధం అయ్యింది.
అవునా...(న‌వ్వుతూ...)
చిరంజీవి ఖైదీ నెం 150 గురించి ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు...?
ట్వీట్ల వ‌ర్షం...(న‌వ్వుతూ..) ఒక అభిమానిగా చిరంజీవి బాహుబ‌లి కంటే పెద్ద సినిమా చేయాలి అనిఎప్పుడో చెప్పాను...ఇప్పుడూ అదే చెప్పాను.
సంక్రాంతికి చిరు, బాల‌య్య మ‌ధ్య పోటీ ఉండ‌దు...వార్ వ‌న్ సైడే అని ట్వీట్ వేయ‌డానికి కార‌ణం ఏమిటి..?
దీనికి ప్ర‌త్యేకించి కార‌ణం అంటూ ఏమీ లేదు. రెండు టీజ‌ర్స్ చూసిన త‌ర్వాత అలా అనిపించింది ట్వీట్ చేసాను అంతే..!
ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కూడా ఎక్కువుగా ట్వీట్స్ వేస్తుంటారు క‌దా..?
అవును..! ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిద్ర‌పోతున్న అగ్నిప‌ర్వ‌తం లాంటోడు. అప్పుడ‌ప్పుడు గుడ గుడ లాడుతూ ప‌గులుతుంటాడు. టైమ్ వ‌చ్చిన‌ప్పుడే పేల‌తాడు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుంది అంటారా..?
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీ అగ్నిప‌ర్వ‌తం పేలితే ఎంత వ‌ర‌కు వ్యాపిస్తుందో అలా జ‌న‌సేన పార్టీ వ్యాపిస్తుంది.
నాగార్జున మీరు చేస్తానంటే శివ 2 చేయ‌డానికి రెడీ అన్నారు క‌దా..మ‌రి చేస్తారా..?
అప్పుడున్న ప‌రిస్ధితుల‌తో శివ తీసాను. శివ‌కు సీక్వెల్ చేయ‌డం అనేది అసాధ్యం.
అమితాబ్, నాగార్జున ఇద్ద‌రితో క‌లిసి ఓ భారీ చిత్రం తీయ‌చ్చు క‌దా..?
గుడ్ ఐడియా...! చూద్దాం..!
ఇంత‌కీ...అమితాబ్ స‌ర్కార్ 3 ఎంత వ‌ర‌కు వ‌చ్చింది.? రిలీజ్ ఎప్పుడు..?
షూటింగ్ అయిపోయింది. మార్చిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.

More News

'పిట్టగోడ' చిత్రంతో హీరోయిన్ గా నాకు చాలా మంచి పేరు వస్తుంది - హీరోయిన్ పునర్నవి

'అష్టాచెమ్మా'తో నాని,అవసరాల శ్రీనివాస్,కలర్స్ స్వాతిలను పరిచయం చేసిన రామ్మోహన్,

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'మా డైరీ - 2017' ఆవిష్కరణ

మూవీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ 'మా డైరీ-2017'ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

అందుకే...ఆత్మవిశ్వాసంతో వేస్తున్న అడుగు సప్తగిరి ఎక్స్ ప్రెస్ - సప్తగిరి

బొమ్మరిల్లు,పరుగు చిత్రాల ద్వారా కమెడియన్ గా పరిచయమై...ప్రేమకథా చిత్రమ్ తో

జనవరి 26న 'S3 - యముడు - 3' విడుదల

వినూత్నమైన కథాంశాల తో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ ను సంపాందించుకున్న సూర్య ,శ్రుతిహసన్,అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం 'S3-యముడు-3'.

పవన్ తో ఉపేంద్ర....

పవన్ కల్యాణ్,డాలీ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం కాటమరాయుడు.