న్యూస్ ఛానల్ పై రామ్ ఫైర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన నేను..శైలజ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో మంచి టాక్ తో దూసుకెళుతుంది. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ మాత్రం నేను..శైలజ సినిమా బాగోలేదంటూ రివ్యూ ప్రసారం చేసింది. అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ తో రన్ అవుతుంటే ఓ న్యూస్ ఛానల్ ఇలా ప్రసారం చేయడంతో రామ్ కి కోపం వచ్చింది.
అంతే ట్విట్టర్ లో రామ్ ఈ విషయం పై స్పందిస్తూ...ప్రొడ్యూసర్ తో ప్రొబ్లమ్ ఉంటే..తప్పు రివ్యూ...పొలిటిషియన్ తో ప్రొబ్లమ్ ఉంటే..తప్పు న్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. న్యూస్ ఛానల్ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండాలి. స్టాండర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. నేను..శైలజ...ఒక్క న్యూస్ ఛానల్ లో తప్ప వరల్డ్ వైడ్ గా అన్ని ప్లేస్ స్ లో బాగా రన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. మరి...రామ్ రియాక్షన్ పై ఆ న్యూస్ ఛానల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com